సీఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్.. నిన్ననే ఆయన భార్యకు కూడా నిర్ధారణ!
- ఐసొలేషన్ లో ఉంటూ పని చేస్తానన్న గెహ్లాట్
- కోవిడ్ ప్రొటోకాల్ ను పాటిస్తానని వ్యాఖ్య
- ప్రతి రోజు ఉదయం 8.30 గంటలకు సమీక్షలు నిర్వహిస్తానని వెల్లడి
అశోక్ గెహ్లాట్ భార్య సునీతా గెహ్లాట్ కు నిన్ననే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వెంటనే ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎందరో నేతలు వివిధ సమీక్షలు, పర్యవేక్షణలు చేస్తున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లను సందర్శిస్తున్నారు. దీంతో, వారు మహమ్మారి బారిన పడుతున్నారు.