కరోనాతో ఒకే రోజు ముగ్గురు ప్రముఖుల మృత్యువాత

29-04-2021 Thu 10:05
  • మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ గైక్వాడ్
  • అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర కుమార్
  • బెంగాలీ రచయిత అనీశ్ దేవ్
  • కొవిడ్‌కు చికిత్స పొందుతూ మృతి
Three prominent persons died with covid

ప్రాణాంతక కరోనా వైరస్ బారినపడి ఒకే రోజు ముగ్గురు ప్రముఖులు మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏక్‌నాథ్ గైక్వాడ్ (81) నిన్న కరోనాతో కన్నుమూశారు. ఎంపీగా, ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు. ఆయన మృతికి కాంగ్రెస్ సంతాపం తెలిపింది. కరోనా బారినపడి లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర కుమార్ నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 59  సంవత్సరాలు. విషయం తెలిసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అలాగే, ప్రముఖ బెంగాలీ రచయిత అనీశ్ దేవ్ కరోనాతో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో దేవ్‌కు కరోనా చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించడంతో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 70  సంవత్సరాలు.