శంకర్ మూవీలో కైరా అద్వాని ప్లేస్ ఖాయమైనట్టే!

29-04-2021 Thu 10:00
  • శంకర్ నుంచి మరో భారీ చిత్రం
  • కథపై సాగుతున్న కసరత్తు  
  • ఐఏఎస్ అధికారిగా చరణ్

Kaira Adwani in Shankar movie

చాలాకాలం క్రితం వరకూ హీరోల స్టార్ డమ్ .. వాళ్లకి గల క్రేజ్ మాత్ర్రమే జనాలను థియేటర్స్ కి రప్పించేది. కానీ దర్శకుడిగా శంకర్ ఎంటర్ అయిన తరువాత పరిస్థితి మారిపోయింది. డైరెక్టర్ ఎవరనేది చూసి థియేటర్లకు రావడమనేది శంకర్ తోనే మొదలైంది. అలా దర్శకుడిగా శంకర్ ఒక కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తూ వచ్చాడు. భారీతనం .. బలమైన కథాకథనాలు .. వైవిధ్యభరితమైన సంగీతం .. అద్భుతమైన లొకేషన్లు శంకర్ సినిమాకి ప్రధానమైన బలంగా మారాయి.

అలాంటి శంకర్ ప్రస్తుతం తెలుగులో చరణ్ హీరోగా ఒక భారీ సినిమా చేస్తున్నాడు. అందుకు సంబంధించిన కథపైనే ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడని అంటున్నారు. అలాగే కైరా అద్వానీని కథానాయికగా ఎంపిక చేసే ఛాన్స్ ఉందనే టాక్ వచ్చింది. ఆమె ఎంపిక దాదాపు ఖరారైపోయిందనేది తాజా సమాచారం. కరోనా ప్రభావం తగ్గగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందట!