బాధపడకు పంత్... ఇలాంటివి మామూలే... పంత్ ను ఓదార్చిన కోహ్లీ!

29-04-2021 Thu 09:01
  • ఆర్సీబీతో మ్యాచ్ లో డీసీ ఓటమి
  • పంత్, హెట్ మేయర్ లకు కోహ్లీ ఓదార్పు
  • ఫోటోలు ట్వీట్ చేసిన ఆర్సీబీ
Kohli and Pant Pics Viral after Defete

విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఎంత మంచి స్నేహితులో, భారత్ కు ఆడేటప్పుడు వీరిద్దరూ ఎంత సరదాగా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కెప్టెన్లుగా ఉన్న రెండు ఐపీఎల్ జట్లూ పోటీలో పాల్గొన్నాయి. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సేన శ్రమించి విజయం సాధించింది. కేవలం ఒక్క పరుగు తేడాతో పంత్ నేతృత్వంలోని ఢిల్లీ కాపిటల్స్ ఓటమి పాలవ్వగా, విరాట్ కోహ్లీ తనలోని క్రీడాస్ఫూర్తిని చూపిస్తూ, పంత్ ను ఓదార్చాడు.

పంత్ తో పాటు మ్యాక్స్ వెల్ ను, మైదానంలో కూర్చుండిపోయిన హెట్ మేయర్ ను కూడా ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలను షేర్ చేసిన బెంగళూరు జట్టు, 'కోహ్లీ కన్నా బాగా చెప్పేవారు ఎవరుంటారు పంత్? ఏది ఏమైనా ఇదంతా నేర్చుకోవడంలో భాగం మాత్రమే' అని కామెంట్ పెట్టింది.