శ్రీలంక ఆటగాడు జోయ్‌సాపై ఆరేళ్ల నిషేధం విధించిన ఐసీసీ

28-04-2021 Wed 18:32
  • నువాన్ జోయ్సాపై అవినీతి ఆరోపణలు నిరూపితం
  • ఏ స్థాయి క్రికెట్లో కూడా ఆడకూడదని ఐసీసీ ఆదేశం
  • శ్రీలంక తరపున 125 మ్యాచులు ఆడిన జోయ్సా
ICC bans Sri Lanka cricketer Nuwan Zoysa for six years

శ్రీలంక క్రికెటర్లు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. శ్రీలంక మాజీ పేసర్ నువాన్ జోయ్సాపై ఐసీసీ ఆరేళ్ల పాటు నిషేధాన్ని విధించింది. ఏ స్థాయి క్రికెట్లో కూడా ఆడటానికి వీల్లేదని ఆదేశించింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతంలోనే జోయ్సా సస్పెండ్ అయ్యాడు. అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ కు సంబంధించి నమోదైన మూడు అభియోగాలు నిజమని తేలడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

శ్రీలంక తరపున జోయ్సా 125 మ్యాచులు ఆడాడు. దశాబ్ద కాలంపాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాడు. తన కెరీర్ లో పలు అవినీతి ఆరోపణలతో యాంటీ కరప్షన్ సెషన్స్ కు హాజరయ్యాడు. జోయ్సా అవినీతిపరులతో చేతులు కలపడమే కాకుండా.. పలువురుని ఆ రొంపిలోకి దించేందుకు యత్నించాడని ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపాడు. 95 టెస్టులు, 30 వన్డేలు ఆడిన జోయ్సా... 172 వికెట్లు తీసుకున్నాడు.