కన్నడ సినీ నటి, ఆమె బోయ్ ఫ్రెండ్ కలిసి.. ఆమె సోదరుడిని చంపి, తగలబెట్టారు: పోలీసులు

28-04-2021 Wed 17:59
  • రియలెస్టేట్ వ్యాపారి ప్రేమలో ఉన్న షనాయా
  • అడ్డొస్తున్నాడని తమ్ముడిని హతమార్చిన వైనం
  • ప్రియుడి ఇంట్లోనే తమ్ముడిని హతమార్చిన షనాయా
Kannada actress Shanaya killed his brother with his lover says police

ప్రియుడి కోసం కన్నడ సినీ నటి షనాయా కత్వె తోడబుట్టిన తమ్ముడినే హత్య చేసి, తగలబెట్టిందని పోలీసులు తెలిపారు. ధర్వాడ్ ఎస్పీ తెలిపిన వివరాల మేరకు... రియలెస్టేట్ వ్యాపారి నియాజ్ తో షనాయా ప్రేమాయణం సాగిస్తోంది. పేయింగ్ గెస్ట్ లా ఆయన ఇంట్లోనే ఉంటోంది. అది నచ్చని ఆమె తమ్ముడు వ్యతిరేకించాడు. దీంతో, తన ప్రేమకు అడ్డుగా ఉండడంతో అతని మట్టుబెట్టేందుకు ప్లాన్ వేసింది.

నియాజ్ ఇంట్లోనే అతనికి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. అనంతరం శవాన్ని ముక్కలుగా నరికి, తగలబెట్టి, ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి అటవీ ప్రాంతంలో పడేశారు. అతని శరీర భాగాలను హుబ్బళి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు గుర్తించారు. ఈ కేసులో షనాయా, ఆమె ప్రియుడితో సహా మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.