ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదు: మంత్రి ఆదిమూలపు సురేశ్

28-04-2021 Wed 17:36
  • ఇంటర్ పరీక్షలపై మంత్రి వర్చువల్ సమీక్ష
  • హాజరైన జేసీలు, ఆర్ఐవోలు, డీఈవోలు
  • మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు
  • ఇప్పటికే పూర్తయిన ప్రాక్టికల్స్
  • అధికారులను అభినందించిన మంత్రి సురేశ్
AP minister Adimulapu Suresh says no state cancelled Inter exams

ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వర్చువల్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి జేసీలు, ఆర్ఐవోలు, డీఈవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు మాట్లాడుతూ, పరీక్షలపై విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని అన్నారు.  

షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇంటర్ పరీక్షలు అనివార్యమని అందరూ గుర్తించాలని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఏపీలో సమర్థంగా ఇంటర్ ప్రాక్టికల్స్ పూర్తి చేసిన అధికారులను అభినందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇంటర్ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.