వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న రమ్యకృష్ణ

28-04-2021 Wed 16:49
  • దేశ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
  • ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్న సెలబ్రిటీలు
  • తాను సెకండ్ డోస్ తీసుకున్నట్టు వెల్లడించిన రమ్యకృష్ణ
Actress Ramya Krishna takes secong dose vaccine

ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ కాసేపటి క్రితం కరోనా వ్యాక్సిన్ రెండో డోసును తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సెకండ్ డోస్ వేయించుకున్నానని వెల్లడించారు. తన ట్వీట్ కు.. గెట్ వ్యాక్సినేటెడ్, స్టే సేఫ్ ఎవ్రీవన్, వేర్ మాస్క్, ఫైట్ టుగెదర్, కోవిడ్ వ్యాక్సిన్ తదితర హ్యాష్ ట్యాగులను జత చేశారు.

దేశంలో కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో... దానిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు, అధికారులు కోరుతున్నారు. సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్ తీసుకుని... ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఫొటోలను షేర్ చేస్తూ, అందరిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు.