Tirupati: తిరుపతి నుంచి 1,049 మంది కరోనా పేషెంట్ల ఆచూకీ గల్లంతు!

Corona patients in Tirupati missing
  • గత రెండు నెలల్లో తిరుపతిలో 9,164 కేసుల నమోదు
  • తిరుపతిని వదిలి వెళ్లిపోయిన 845 మంది బాధితులు
  • తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్న వైనం
కరోనా పేషెంట్ల నిర్వాకంతో తిరుపతి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. గత రెండు నెలల కాలంలో తిరుపతిలో 9,164 మంది కరోనా బారిన పడగా... ప్రస్తుతం 7,270 మంది ఆచూకీ మాత్రమే లభించింది. మిగిలిన 1,049 మంది రోగులు ఎక్కడున్నారనే విషయం తెలియడం లేదు. వారు ఇచ్చిన ఇంటి నెంబర్లలో కూడా వారు లేరు. వారి ఫోన్ నంబర్లు కూడా పని చేయడం లేదు. దీంతో వారి కోసం అధికారులు వెతకడాన్ని ప్రారంభించారు. మరో 845 మంది పాజిటివ్ రోగులు తిరుపతిని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని అధికారులు గుర్తించారు.

కరోనా శాంపిల్స్ ఇచ్చే సమయంలో బాధితులు తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఆ తర్వాత టెస్టు రిపోర్టులు రాకముందే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యక్తులు ఇతరులకు కూడా కరోనాను అంటిస్తున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
Tirupati
Corona Patients
Missing

More Telugu News