Sensex: వరుసగా మూడో రోజు దూసుకుపోయిన మార్కెట్లు.. 800 పాయింట్ల వరకు లాభపడ్డ సెన్సెక్స్!

  • 790 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 212 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7.73  శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్
Sensex gains 790 points

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఈరోజు కూడా భారీ లాభాలను మూటగట్టుకుంది. బ్యాంకెక్స్, ఫైనాన్స్ స్టాకుల అండతో ఈరోజు మార్కెట్లు ఆద్యంతం లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 790 పాయింట్లు లాభపడి 49,734కి చేరుకుంది. నిఫ్టీ 212 పాయింట్లు పెరిగి 14,865 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (7.73%),  ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.98%), బజాజ్ ఫిన్ సర్వ్ (4.06%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (3.71%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.65%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-0.97%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.30%), ఎల్ అండ్ టీ (-0.26%), టీసీఎస్ (-0.24%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.17%).

More Telugu News