YS Sharmila: మీ అక్కగా నేను కోరేది ఒక్కటే... నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు: వైఎస్ షర్మిల

YS Sharmila calls unemployed do not loss confidence
  • నల్గొండ జిల్లాలో శ్రీకాంత్ అనే పీజీ విద్యార్థి ఆత్మహత్య
  • నిరుద్యోగులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దన్న షర్మిల
  • తాను అండగా ఉంటానని వెల్లడి
  • ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడదామని పిలుపు
తెలంగాణలో నూతన రాజకీయ పార్టీ స్థాపనకు సన్నాహాలు చేస్తున్న వైఎస్ షర్మిల రాష్ట్రంలోని సమస్యలపై పోరాట బాట పట్టారు. ఇప్పటికే ఆమె నిరుద్యోగుల కోసం దీక్ష కూడా చేశారు. తాజాగా ఇదే అంశంపై ఆమె స్పందించారు. నిరుద్యోగులు ఆత్మవిశ్వాసం కోల్పోరాదని, ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల కోసం తాను ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

మీ అక్కగా చెబుతున్నా... దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని సందేశం అందించారు. రేపటి భవిష్యత్ కోసం ఇవాళ మార్పు తేవాలని, ఆ మార్పు కోసం అందరం కలిసికట్టుగా పోరాడదాం అని నిరుద్యోగుల్లో స్ఫూర్తినింపే ప్రయత్నం చేశారు.

నల్గొండ జిల్లాలో శ్రీకాంత్ అనే పీజీ విద్యార్థి ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వార్త క్లిప్పింగ్ ను ట్విట్టర్ లో పంచుకున్న షర్మిల ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila
Unemployed Youth
Suicide
Telangana

More Telugu News