Adimulapu Suresh: టీడీపీకి ఏం పనిలేక పరీక్షలపై విమర్శలు చేస్తోంది: మంత్రి ఆదిమూలపు

AP Education Minister Adimulapu Suresh criticizes TDP leaders
  • ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ
  • సర్కారుపై విమర్శలు
  • స్పందించిన విద్యాశాఖ మంత్రి
  • కరోనా సమయంలో సమర్థంగా క్లాసులు నిర్వహించినట్టు వెల్లడి
  • అంతే సమర్థతతో పరీక్షలు జరుపుతామని ధీమా
ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని తాము నిర్ణయిస్తే, విపక్ష టీడీపీ విమర్శలు చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. టీడీపీ నేతలకు ఏం పని లేక పరీక్షలపై పడ్డారని ఎద్దేవా చేశారు. కరోనా వ్యాప్తి సమయంలోనూ సమర్థవంతంగా క్లాసులు నిర్వహించామని వెల్లడించారు. ఇప్పుడు పరీక్షలను కూడా అంతే సమర్థతతో చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక కొవిడ్ అధికారిని నియమిస్తామని మంత్రి సురేశ్ చెప్పారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా యాప్ ను కూడా తీసుకువచ్చామని వెల్లడించారు. పరీక్ష కేంద్రం, తన సీట్ చూసుకునే విధంగా యాప్ రూపొందించినట్టు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నారని పేర్కొన్నారు.
Adimulapu Suresh
TDP Leaders
Exams
Andhra Pradesh
Corona Pandemic

More Telugu News