IPL: ఐపీఎల్​ విజేతపై రవిశాస్త్రి ఆసక్తికర​ కామెంట్స్​

Ravi Shastri Makes Bold Prediction On IPL New Winner
  • కొత్త విజేత అవతరిస్తుందన్న టీమిండియా కోచ్
  • అందుకు విత్తనాలు పడ్డాయని వ్యాఖ్యలు
  • ఆర్సీబీ, ఢిల్లీ మ్యాచ్ ను ప్రస్తావిస్తూ కామెంట్లు
నిన్న ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన హోరాహోరీలో చివరకు కింగ్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీనే నెగ్గింది. ఒక్క పరుగుతో గెలిచిన ఆ జట్టు సంబురాలు చేసుకుంది. చివరి వరకు పంత్ క్రీజులో ఉన్నా.. ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు దంచినా.. పంత్ జట్టు ఒక్క పరుగు దూరంలో ఆగిపోయి నిరాశగా పెవిలియన్ బాట పట్టింది. ప్రేక్షకులకు అంతులేని మజాను ఆ మ్యాచ్ పంచిందనడంలో అతిశయోక్తి లేదేమో.

అయితే, ఈసారి ఐపీఎల్ లో కొత్త విజేత అవతరిస్తారని టీమిండియా కోచ్ రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను ప్రస్తావిస్తూ ఆతడు ఈ కామెంట్ చేశాడు. మ్యాచ్ కు సంబంధించి విరాట్, పంత్ కలిసి ఉన్న ఫొటోనూ ట్వీట్ చేశాడు.  ‘‘ఈ ఐపీఎల్ లో కొత్త విజేత అవతరించేందుకు విత్తనాలు నాటుకున్నాయి. నిన్న రాత్రి హోరాహోరీ జరిగింది’’ అంటూ అతడు ట్వీట్ చేశాడు.

ఇప్పటికే ఐదు టైటిల్స్ సాధించి రోహిత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. మరో టైటిల్ ను పట్టేందుకు రెడీ అవుతోంది. మరి, ఈ సీజన్ లోనూ మరో టైటిల్ వేటాడి ముంబై హ్యాట్రిక్ కొడుతుందా? లేదంటే రవిశాస్త్రి చెప్పినట్టు కొత్త విజేత పుట్టుకొస్తుందా? వేచి చూడాల్సిందే.
IPL
Ravi Shastri
Team India
RCB
Delhi Capitals

More Telugu News