uppena: అచ్చం 'ఉప్పెన' హీరోయిన్‌లా ఉన్న అమ్మాయి.. ఫొటోలు వైర‌ల్

kriti doop pics go viral
షార్ట్స్‌లో చూడండి
మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ న‌టించిన తొలి సినిమా 'ఉప్పెన' సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే.  లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి న‌ట‌న‌కు అంద‌రూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా త‌ర్వాత ఆమెకు బోలెడు ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అయితే, ఇప్ప‌టికే అచ్చం ఆమె పోలిక‌తో ఓ అమ్మాయి ప‌లు ద‌క్షిణాది సినిమాల్లో న‌టించింది.

ఆమె ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అచ్చం కృతిశెట్టిలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కృతిశెట్టికి సోద‌రి అవుతుందా? అని కొంద‌రు ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. అచ్చం కృతిశెట్టిలా ఉన్న ఈ న‌టి పేరు విద్య విను మోహ‌న్. ఆమె  త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాలల్లో న‌టించింది. ఇప్పుడు ప‌లు సీరియ‌ళ్ల‌లో న‌టిస్తోంది.  

Go Back to Shorts
uppena
Tollywood
Viral Pics

More Telugu News