డౌట్ లేదు .. సంక్రాంతికే 'హరిహర వీరమల్లు'

28-04-2021 Wed 11:49
  • చారిత్రక నేపథ్యంలో సాగే 'హరిహర వీరమల్లు'
  • సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది
  • క్రిష్ ప్లానింగ్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది

Hari Hara Veera Mallu will release at Sankranthi

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ప్రస్తుతం రెండు సినిమాలు రూపొందుతున్నాయి. ఒకటి సాగర్.కె చంద్ర దర్శకత్వంలో అయితే, మరొకటి క్రిష్ దర్శకత్వంలో. చారిత్రక నేపథ్యంలో సాగే కథను ఎంచుకున్న క్రిష్, ఇటీవలే ఈ సినిమాకి 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ ను ఖాయం చేశాడు. ఈ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వజ్రాల దొంగగా పవన్ కనిపించనున్న ఈ సినిమాకి, ఎ.ఎమ్.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా చెప్పారు.

అయితే కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగులు వాయిదాపడ్డాయి. అలాగే విడుదల తేదీలను కూడా వాయిదా వేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 'హరిహర వీరమల్లు' కూడా సంక్రాంతికి రాకపోవచ్చనే ఒక టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఎ.ఎమ్.రత్నం స్పందిస్తూ .. " సంక్రాంతికి ఇంకా చాలా సమయం ఉంది .. ఇక క్రిష్ తాను అనుకున్న సమయానికంటే ముందుగానే షూటింగు పూర్తి చేసే దర్శకుడు. అందువలన 'హరిహర వీరమల్లు' విడుదలను వాయిదా వేసే పరిస్థితి రాదు. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో ఉంటుంది" అని చెప్పుకొచ్చారు.