Allu Arjun: టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్

Tollywood hero Allu Arjun tested corona positive
  • స్వయంగా వెల్లడించిన ఐకాన్ స్టార్
  • తనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని వివరణ
  • ఇంటివద్దే ఐసోలేషన్
  • తనను కలిసినవాళ్లు టెస్టు చేయించుకోవాలని సూచన
  • అభిమానులు ఆందోళన చెందవద్దని స్పష్టీకరణ
టాలీవుడ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని తెలిపారు. అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ ప్రస్తుతం ఇంటివద్దే ఐసోలేషన్ లో ఉన్నానని బన్నీ వివరించారు. ఇటీవల తనను కలిసిన వాళ్లు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.

ఇంటి వద్దే ఉంటూ సురక్షితంగా ఉండండి, మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి అని అభిమానులకు పిలుపునిచ్చారు. తన ఆరోగ్య పరిస్థితి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని శ్రేయోభిలాషులకు, అభిమానులకు తెలిపారు. ప్రేమతో మీ అల్లు అర్జున్ అంటూ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
Allu Arjun
Corona Virus
Positive
Isolation
Tollywood

More Telugu News