Cowin: కొవిన్ లో 18 ఏళ్లు పైబడిన వారికి ఇంకా మొదలుకాని రిజిస్ట్రేషన్... సాయంత్రం తరువాతేనన్న కేంద్రం!

  • ఈ ఉదయం మొదలుకాని రిజిస్ట్రేషన్లు
  • సాయంత్రం 4 తరువాత మొదలు
  • స్వల్ప మార్పులు చేస్తున్నామన్న కేంద్రం
Cowin Registration Today After 4 PM Only

మే 1 నుంచి ఇండియాలో మూడవ దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగనుండగా, 18 ఏళ్లకు పైబడిన వారంతా నేటి నుంచి కొవిన్ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని గత వారమే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉదయం నుంచి వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. రిజిస్ట్రేషన్ కోసం ప్రయత్నించిన వారికి, 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అన్న మెసేజ్ కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం ఓ ప్రకటన చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయాల్లో స్వల్ప మార్పులు చేశామని, సాయంత్రం 4 గంటల తరువాత రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయని పేర్కొంది. , కొవిన్ వెబ్ సైట్, ఆరోగ్య సేతు, ఉమాంగ్ యాప్ లలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, ఆపై వారికి దగ్గరలో ఉన్న టీకా కేంద్రాల నుంచి ఆపాయింట్ ఖరారవుతుందని కేంద్రం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

ఇదిలావుండగా, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే టీకాలను 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి ఇవ్వరాదన్న ఆదేశాలు రాష్ట్రాలకు అందాయి. రాష్ట్రాలు, ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలు టీకాలను కొనుగోలు చేసి, వాటిని మూడవ దశ వ్యాక్సినేషన్ లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి అందిచవచ్చని తెలిపింది. 18 సంవత్సరాలు దాటిన వారికి ముందస్తు నమోదు మాత్రమే ఉంటుందని, వారికి వాకిన్ రిజిస్ట్రేషన్ ఉండబోదని స్పష్టం చేసింది.

More Telugu News