కత్రినా సినిమా కోసం రంగంలోకి విజయ్ సేతుపతి!

28-04-2021 Wed 10:40
  • కత్రినా ప్రధాన పాత్రధారిగా 'మేరీ క్రిస్మస్'
  • కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్
  • వచ్చేనెలలో 'గోవా'లో మొదలు      

Merry Christmas shooting starts from next month in GOA

తమిళనాట విలక్షణ నటుడిగా ఇప్పుడు విజయ్ సేతుపతి పేరు మారుమ్రోగిపోతోంది. పాత్ర పరమైన ప్రయోగాలు చేయాలనుకునే దర్శకులు ఆయనను దృష్టిలో పెట్టుకునే, ఆ పాత్రలను డిజైన్ చేసుకుంటున్నారు. విజయ్ సేతుపతి నటనలో సహజత్వం కారణంగా, ఇతర భాషల నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఒక వైపున తెలుగులోను మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన, బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఆకర్షించడం విశేషం.

బాలీవుడ్ లో కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా 'మేరీ క్రిస్మస్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. 'అంధదూన్' దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. 'గోవా'లో ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ కత్రినా కరోనా బారిన పడటం వలన షూటింగు ఆగిపోయింది. వచ్చే నెలలో 'గోవా'లో షూటింగు చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. కత్రినా .. విజయ్ సేతుపతి కాంబినేషన్లోని కొన్ని సీన్స్ ను చిత్రీకరిస్తారట. తక్కువ సిబ్బందితో షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది.