Naxals: మహారాష్ట్రలో ఎన్ కౌంటర్... ఇద్దరు మావోల మృతి

Two naxals died in Maharashtra
  • మావోయిస్టులకు ఎదురుదెబ్బ
  • గడ్చిరోలి జిల్లాలో పోలీసుల కూంబింగ్
  • కాల్పులు జరిపిన నక్సల్స్
  • దీటుగా బదులిచ్చిన పోలీసు బలగాలు
మహారాష్ట్రలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. ఎటపల్లి అటవీప్రాంతంలో పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరిగాయి. కూంబింగ్ కు వెళ్లిన పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు. పోలీసులను చూసి నక్సల్స్ కాల్పులు జరపడంతో, పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు.

ఈ కాల్పుల్లో మావోయిస్టులకు ప్రాణనష్టం జరిగినట్టు గుర్తించామని, వారికి చెందిన సామగ్రి స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ వెల్లడించారు. రెండ్రోజుల కిందట గడ్చిరోలి జిల్లాలోని పెర్మిలి ప్రాంతంలో నక్సల్స్ 4 ట్రాక్టర్లు, 2 ట్యాంకర్లకు నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Naxals
Death
Encounter
Police
Gadchiroli
Maharashtra

More Telugu News