నంద్యాలలో విషాదం.. కుటుంబం మొత్తం ఆత్మహత్య

Family of 4 died by suicide in Nandyal
  • ఆర్థిక ఇబ్బందులే కారణం!
  • ఇద్దరు పిల్లలు సహా నలుగురు మృతి
  • మల్దార్‌పేటలో విషాదం
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. నడిగడ్డ సమీపంలోని మల్దార్‌పేటకు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శేఖర్ (35), కళావతి (30), అంజని (15), అఖిల (13) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విగత జీవులుగా మారిన శేఖర్, కళావతి, పిల్లలను చూసి బంధువులు బోరున విలపించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన గ్రామం విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Go Back to Shorts
Kurnool District
Nandyal
Family
Suicide

More Telugu News