Navjot Dahiya: ప్రధాని మోదీ ఓ సూపర్ స్ప్రెడర్: ఐఎంఏ ఉపాధ్యక్షుడు

  • దేశంలో కరోనా సెకండ్ వేవ్
  • ఇంకా కొన్నిచోట్ల ఎన్నికలు
  • అన్నివైపుల నుంచి విమర్శలు
  • ఘాటుగా వ్యాఖ్యలు చేసిన డాక్టర్ నవజ్యోత్ దహియా
IMA Vice President Navjot Dahiya terms PM Modi a Super Spreader

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వేళ ఎన్నికలు జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఉపాధ్యక్షుడు డాక్టర్ నవజ్యోత్ దహియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీనే కరోనా వైరస్ ను ఎక్కువగా వ్యాప్తి చేసే సూపర్ స్ప్రెడర్ అని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలు ఏర్పాటు చేశారని, కుంభమేళాకు అనుమతించారని మోదీపై ఆరోపణలు చేశారు.

"వైద్య రంగం అంతా కొవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కలిగించే యత్నాలు చేస్తున్న వేళ ప్రధాని మోదీ మాత్రం భారీ బహిరంగ సభలు పెట్టేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. కరోనా మార్గదర్శకాలన్నింటినీ గాలికొదిలేశారు" అని దహియా వ్యాఖ్యానించారు.

భారత్ లో తొలి కరోనా కేసు 2020 జనవరిలో నమోదైందని, ఆ సమయంలో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడానికి బదులు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను స్వాగతించేందుకు లక్షమందితో గుజరాత్ లో సభ ఏర్పాటు చేశారని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఈ ఏడాది పాటు వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దాంతో కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ కి చేరకముందే వైద్య ఆరోగ్య వ్యవస్థ వైఫల్యం చెందుతోందని దహియా విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా సైతం మోదీ వైఫల్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News