Jagan: ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ఫోన్ చేసిన ముఖ్యమంత్రి జగన్

Jagan telephones Andhrajyothi MD Radhakrishna
  • అనారోగ్య కారణాలతో మృతి చెందిన రాధాకృష్ణ సతీమణి
  • రాధాకృష్ణను పరామర్శించిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు
  • ఫోన్ చేసి సంతాపాన్ని తెలియజేసిన జగన్

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 63 సంవత్సరాలు. కనకదుర్త మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తదితరులు రాధాకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మరోవైపు రాధాకృష్ణకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫోన్ చేశారు. కనకదుర్గ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. ఫోన్ ద్వారా రాధాకృష్ణను పరామర్శించారు.

  • Loading...

More Telugu News