కొత్త రికార్డుకు కొంచెం దూరంలో 'పుష్ప' టీజర్!

27-04-2021 Tue 17:19
  • కొత్త లుక్ తో కనిపించనున్న బన్నీ
  • చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేశ్
  • బన్నీతో తలపడనున్న ఫహాద్ ఫాజిల్  

Pushpa teaser crossed 50 million views

అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. కేవలం అల్లు అర్జున్ పాత్రను హైలైట్ చేస్తూ యూ ట్యూబ్ లో వదిలిన ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. టాలీవుడ్లో ఇంతవరకూ అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ ను రాబట్టిన టీజర్ గా 'ఆర్ ఆర్ ఆర్' నిలిచింది. అంతకన్నా వేగంగా ఆ రికార్డును 'పుష్ప' టీజర్ టచ్ చేసింది. ఇక ఒకటి రెండు రోజుల్లో 'పుష్ప' టీజర్ కొత్త రికార్డును సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఒక కథానాయకుడి పాత్రను ఎంతవరకూ ఎలా పరిచయం చేయాలో సుకుమార్ అంతేలా హీరో పాత్రను పరిచయం చేశాడు. అడవితో .. స్మగ్లింగ్ తో పుష్పకు ఉన్న సంబంధం ఏమిటి? ఎవరి కోసం .. ఎందుకోసం ఆయన ఇలా మారాడు? అనే సస్పెన్స్ ను సుకుమార్ క్రియేట్ చేశాడు. ఆయన ఈ టీజర్ ను కట్ చేసిన విధానమే ఈ స్థాయి రెస్పాన్స్ కి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, బన్నీకి చెల్లి పాత్రలో ఐశ్వర్య రాజేశ్ నటిస్తోంది. విలన్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు.