అమెరికా అధ్యక్షుడికి ప్రియాంకాచోప్రా విన్నపం!

27-04-2021 Tue 16:52
  • భారత్ లో కరోనా విలయంపై ప్రియాంకాచోప్రా ఆందోళన
  • మనస్సు తరుక్కుపోతోందని వ్యాఖ్య
  • భారత్ కు వ్యాక్సిన్ పంపించాలని అమెరికా అధ్యక్షుడికి విన్నపం
Priyanka Chopra urges US President to help India

అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ను పెళ్లాడిన తర్వాత బాలీవుడ్ నటి ప్రియాంకాచోప్రా అక్కడే ఉంటోంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటోంది. తాజాగా, భారత్ లో పెరిగిపోతున్న కరోనా కేసులపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, వీడియోలను చూసి మనసు తరుక్కుపోతోందని తెలిపింది. ఇదే సమయంలో  అమెరికా అధ్యక్షుడికి ఆమె ఒక విన్నపం చేసింది.

దారుణ పరిస్థితిలో ఉన్న భారత్ కు అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను పంపించాలని ప్రియాంక కోరింది. ప్రపంచంలోని అనేక దేశాలకు అమెరికా వ్యాక్సిన్ ను అందిస్తోందని... ఇది చాలా గొప్ప విషయమని తెలిపింది. తన దేశం ఇబ్బందుల్లో ఉందని... వెంటనే ఇండియాకు వ్యాక్సిన్ పంపించగలరా? అని కోరింది. ప్రస్తుతం ప్రియాంక 'సైటడెల్' అనే స్పై సిరీస్ లో నటిస్తోంది. 'టెక్స్ట్ ఫర్ యు' అనే ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ ను పూర్తి చేసింది.