China: కరోనాతో అల్లాడుతున్న భారత్​ కు చైనా ఆపన్నహస్తం

  • 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పంపిన డ్రాగన్ దేశం
  • వారంలో మరో 10 వేలు పంపేందుకు చర్యలు
  • ఇప్పటికే సాయానికి ముందుకొచ్చిన పలు దేశాలు
China Provides 800 Concentrators to India

కరోనా కల్లోలంతో అల్లాడిపోతున్న భారత్ కు పలు దేశాలు ఆపన్నహస్తాన్ని అందిస్తున్నాయి. ఆ దేశాల జాబితాలో తాజాగా చైనా కూడా చేరింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి దేశాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. అదే కోవలో భారత్ కు 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పంపించింది. ఇంకో వారంలో మరో 10 వేల కాన్సన్ట్రేటర్లను పంపించనుంది.

దేశంలో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అయిపోయి పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ను తరలించేందుకు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది.

More Telugu News