COVID19: భౌతిక దూరం పాటించకుంటే.. ఒక వ్యక్తి నుంచి 406 మందికి కరోనా!

  • హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
  • పలు యూనివర్సిటీల అధ్యయనంలో తేలిందని వెల్లడి
  • మాస్కులు పెట్టుకుంటే కరోనా ముప్పు 1.5 శాతమే
  • మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి అని ప్రజలకు సూచన
If we wont maintain physical distance then one person able to transmit covid 19 to 406 persons say centre

కరోనా ఉందన్న భయం కూడా లేకుండా జనం ఇంకా గుంపులు గుంపులుగానే తిరుగుతున్నారు. అయితే, భౌతిక దూరం పాటించకుండా ప్రజలు ఇలాగే గుమిగూడితుంటే.. 30 రోజుల్లోనే ఒక్కో కరోనా పేషెంట్ నుంచి 406 మందికి వ్యాపిస్తుందని కేంద్రం వెల్లడించింది. మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తేల్చి చెప్పారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు భౌతిక దూరం పాటించకుంటే 30 రోజుల్లోనే వందలాది మందికి కరోనా వ్యాపిస్తుందన్న విషయం పలు యూనివర్సిటీల అధ్యయనాల్లో వెల్లడైందని ఆయన చెప్పారు. జనాల గుంపులు 50 శాతం తగ్గితే ఒక్కో కరోనా రోగి నుంచి 15 మందికి మహమ్మారి వ్యాపిస్తున్నట్టు తేలిందన్నారు. అదే 75 శాతానికి తగ్గితే కేవలం 2.5 మందికే అంటుతుందన్నారు.

ఆరడుగుల భౌతిక దూరం పాటించినా ఒక కరోనా రోగి నుంచి మరొకరికి మహమ్మారి సోకుతుందన్నారు. మాస్కులను సరిగ్గా పెట్టుకోకపోయినా మహమ్మారి వ్యాప్తి 90 శాతం పెరిగే ముప్పుందన్నారు. మాస్కులను ప్రతి ఒక్కరూ ధరించడం వల్ల కరోనా సోకే ముప్పు కేవలం 1.5 శాతమేనని, దానికి తోడుగా భౌతిక దూరాన్ని పాటిస్తే ఆ ముప్పు మరింత తగ్గుతుందని చెప్పారు.

More Telugu News