'అంటే .. సుందరానికీ!' నజ్రియా హ్యాండ్ ఇచ్చేసిందా?

27-04-2021 Tue 11:59
  • రీసెంట్ గా హైద్రాబాద్ వచ్చిన నజ్రియా
  • పెరుగుతున్న కరోనా కేసులు చూసి టెన్షన్
  • ఆమె కాంబినేషన్లోని సీన్స్ వాయిదా  

Nazriya left the Ante Sundaraniki shooting spot due to corona effect

నాని ఒక వైపున 'శ్యామ్ సింగ రాయ్' సినిమా షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున 'అంటే .. సుందరానికీ!' సినిమా షూటింగును కూడా కానిచ్చేస్తున్నాడు. చాలా సినిమాల షూటింగు ఆగిపోయినప్పటికీ, ఈ రెండు సినిమాల షూటింగును చాలా తక్కువమంది సిబ్బందితో కానిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరసన నాయికగా నజ్రియా నజీమ్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి ఇటీవలే ఆమె హైదరాబాద్ వచ్చింది.


'అంటే .. సుందరానికీ' సినిమాలో నజ్రియా నాయికగా చేస్తుంటే, ఆమె భర్త ఫహద్ ఫాజిల్, 'పుష్ప' సినిమాలో విలన్ గా  నటిస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. ఆయా సినిమా టీమ్ లు వాళ్లకు వెల్కమ్ చెప్పాయి. అయితే హైదరాబాద్ వచ్చిన తరువాత ఇక్కడి కరోనా కేసుల తీవ్రత చూసిన నజ్రియా, ఇలాంటి పరిస్థితుల్లో తాను షూటింగ్ చేయలేనని చెప్పేసి వెళ్లిపోయిందని అంటున్నారు. దాంతో ఆమె కాంబినేషన్లోని సీన్స్ ను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నదియా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.