ఈ హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది: చిరంజీవి

27-04-2021 Tue 11:27
  • హనుమంతుడు మనవాడే
  • ఈ విషయాన్ని ఆధారాలతో సహా టీటీడీ రుజువు చేసింది
  • మన గుండెల్లో కొలువైన సూపర్ మేన్ హనుమ
Todays Hanuman Jayanthi has a speaciality says Chiranjeevi

హనుమాన్ జయంతి సందర్భంగా సినీ నటుడు చిరంజీవి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ హనుమాన్ జయంతికి ఒక ప్రత్యేకత ఉందని... హనుమాన్ మనవాడేనని చెప్పారు. మన తిరుమల కొండల్లోనే హనుమాన్ జన్మించాడని అన్నారు. ఈ విషయాన్ని అన్ని ఆధారాలతో తిరుమల తిరుపతి దేవస్థానం రుజువు చేసిందని తెలిపారు. హనుమాన్ ఎక్కడివాడు, ఎప్పటివాడు అనే విషయాన్ని పక్కనపెడితే మన గుండెల్లో కొలువైన సూపర్ మేన్ లార్డ్ హనుమ అని ట్వీట్ చేశారు.

తిరుమల గిరుల్లోని అంజనాద్రిలో హనుమంతుడు జన్మించాడని టీటీడీ ఆధారాలతో సహా ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. హనుమంతుడి జన్మస్థానంపై మన దేశంలో అనేక ప్రాంతాలకు సంబంధించిన కథనాలు ఉన్నాయి. అయితే ఈ అంశంపై లోతుగా అధ్యయనం జరిపిన టీటీడీ హనుమాన్ జన్మస్థానం తిరుమల గిరులే అని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి తెలియజేశారు.