'సర్కారువారి పాట'లో కామెడీ హైలైట్ అట!

27-04-2021 Tue 11:26
  • వినోదభరితమైన కథతో 'సర్కారువారి పాట'
  • బ్యాంకు అధికారి కొడుకుగా మహేశ్ బాబు
  • కథానాయికగా కీర్తి సురేశ్    

Comedy scenes are highlighted in Sarkaruvari Paata

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, కొంతవరకూ షూటింగు జరుపుకుంది. దుబాయ్ లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ మహేశ్ అభిమానులతో వన్స్ మోర్ కొట్టించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. కరోనా ప్రభావం చాలావరకూ తగ్గిన తరువాతనే తిరిగి సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు.


ఈ సినిమాకి కామెడీ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. సప్తగిరి .. ప్రియదర్శి .. అనసూయ కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతున్నారు. కన్ఫ్యూజన్లో సాగే ఈ కామెడీ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. హీరో తండ్రి ఒక బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ ఉంటాడట. ఒక బిజినెస్ మెన్ ఆ బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలను తీసుకుని ఎగ్గొడతాడు. తన తండ్రికి చెడ్డపేరు రాకుండా ఉండటం కోసం రంగంలోకి దిగిన హీరో, ఆ బిజినెస్ మెన్ తో ఎలా ఆ డబ్బు కంట్టించాడనేదే కథ అట. అందుకు మహేశ్ బాబు వేసే ప్లాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు.