ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల అస్ట్రాజెనికా టీకా డోస్ లను పంచనున్నాం: వైట్ హౌస్
- అందుబాటులోకి రాగానే పంపిణీ మొదలు
- ముందుగా ఫెడరల్ సేఫ్టీ రివ్యూ జరుగుతుంది
- వెల్లడించిన వైట్ హౌస్ సలహాదారు ఆండీ సాల్విట్
కాగా, ఫెడరల్ సేఫ్టీ రివ్యూ తరువాత ఈ ఎగుమతులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది. గడచిన మార్చిలో అమెరికా నుంచి 40 లక్షల టీకా డోస్ లు కెనడా, మెక్సికో దేశాలకు అందాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవలి కాలంలో ఇండియా సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతున్న వేళ, బైడెన్ సర్కారుపై వ్యాక్సిన్ సరఫరా చేయాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే శ్వేతసౌధం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.