Driving Tests: ఏపీలో మే 31 వరకు డ్రైవింగ్ లైసెన్స్ టెస్టుల స్లాట్ బుకింగ్స్ నిలిపివేత

Driving tests has been cancelled in AP due to corona pandemic
  • రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రం
  • ఎల్ఎల్ఆర్ లు తాత్కాలికంగా నిలిపివేత
  • ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారికి మరో తేదీ
  • ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ కమిషనర్

కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతున్నందున రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలు తాత్కాలికంగా నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేపటి నుంచి మే 31 వరకు ఎల్ఎల్ఆర్ లు, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షల స్లాట్ బుకింగ్ లు నిలుపుదల చేస్తున్నట్టు రవాణాశాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లోని కార్యాలయాలకు రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వారు ఇతర తేదీలకు మార్చుకునే వెసులుబాటు కల్పించారు. సర్వీసులన్నీ ఆన్ లైన్ లో aprtacitizen.epragathi.orgలో పొందపరిచామని... ప్రజలు కార్యాలయాలకు రాకుండా నేరుగా వెబ్ సైట్లో చూసుకోవచ్చని రవాణా శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News