KKR: పంజాబ్ కింగ్స్ పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా

KKR won the toss and elected bowling against Punjab Kings
  • నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
  • ఐపీఎల్ తాజా సీజన్ లో అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్
  • పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కోల్ కతా
  • ఐదో స్థానంలో కొనసాగుతున్న పంజాబ్
ఐపీఎల్ 14వ సీజన్ లో ఇప్పటివరకు ముంబయి, చెన్నై వేదికల్లో మ్యాచ్ లు జరిగాయి. అయితే ఇవాళ పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కు అతిపెద్ద స్టేడియంగా పేరుగాంచిన నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది.

కోల్ కతా జట్టు ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉంది. కోల్ కతాతో పోల్చితే పంజాబ్ కింగ్స్ ది కాస్త మెరుగైన పరిస్థితి అని చెప్పాలి. పంజాబ్ 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు, 3 ఓటములతో ఐదో స్థానంలో ఉంది.
KKR
Punjab Kings
Toss
Bowling
IPL

More Telugu News