ఏపీలో కొనసాగుతున్న కరోనా బీభత్సం... 51 మంది మృతి
- గత 24 గంటల్లో 74,041 కరోనా పరీక్షలు
- 9,881 మందికి పాజిటివ్
- నెల్లూరు జిల్లాలో 1,592 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 4,431 మంది
- యాక్టివ్ కేసుల సంఖ్య 95,131
అదే సమయంలో 4,431 మంది కరోనా నుంచి కోలుకోగా, 51 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 10,43,441 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 9,40,574 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 95,131 మందికి చికిత్స జరుగుతోంది. అటు, కరోనా మృతుల సంఖ్య 7,736కి పెరిగింది.