'ఆచార్య'లో పూజా హెగ్డే అలా ఎంట్రీ ఇస్తుందట!

26-04-2021 Mon 18:38
  • పవర్ఫుల్ గా చిరూ పాత్ర
  • ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో పూజా హెగ్డే
  • రెజీనా ఐటమ్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ

Pooja Hegde entry in Acharya movie

చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' రూపొందుతోంది. ఎప్పటికప్పుడు కోవిడ్ కారణంగా అవాంతరాలను ఎదుర్కొంటూనే ఈ సినిమా షూటింగు ముందుకు సాగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ సినిమా కరోనా కారణంగానే వాయిదా పడింది. విడుదల తేదీ విషయంలోను మనసు మార్చుకున్నారు. అవినీతిని అంతమొందించడమే ఆశయమైతే, దానికి  ఆయుధం కూడా అవసరమే అని నమ్మే వ్యక్తిగా చిరూ పాత్ర కనిపించనుంది. ఆయన సరసన నాయికగా కాజల్ నటిస్తున్న ఈ సినిమాలో, చరణ్ జోడీగా పూజా హెగ్డే కనువిందు చేయనుంది.

పూజా హెగ్డే పాత్ర ఎలా ఎంట్రీ ఇస్తుంది? ఆమె పాత్ర స్వరూప స్వభావాలు ఎలాంటివి? వంటి ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో ముందుగా చరణ్ - పూజ హెగ్డే పాత్రల్లో చరణ్ పాత్రనే ముందుగా రివీల్ చేస్తారట. ఆ తరువాత చరణ్ తన ఫ్లాష్ బ్యాక్ ను చెప్పడం మొదలుపెడితే, అందులో భాగంగా పూజా హెగ్డే కనిపిస్తుందని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ పూజా హెగ్డే ఎపిసోడ్ పైనే పడుతుందని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ కథకి చాలా కీలకమని అంటున్నారు. రెజీనా ఐటమ్ కూడా ఈ సినిమాకి ప్ర్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందట.