కరోనాతో సినీ దర్శకుడు బాలాజీ ప్రసాద్ మృతి

26-04-2021 Mon 18:17
  • కరోనాతో మృతి చెందిన సాయి బాలాజీ ప్రసాద్
  • గచ్చిబౌలిలోని టిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
  • పలు చిత్రాలకు, ధారావాహికలకు దర్శకత్వం వహించిన బాలాజీ
Tollywood director Sai Balaji Prasad dies with Corona

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ (57) కరోనాతో మృతి చెందారు. గచ్చిబౌలిలోని టిమ్స్ కోవిడ్ సెంటర్ లో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. 'శివాజీ', 'ఒరేయ్ తమ్ముడూ' వంటి చిత్రాలకు ఆయన దర్శకుడిగా పని చేశారు. 'హాలాహలం', 'అపరంజి', 'సిరి' వంటి ధారావాహికలకు కూడా దర్శకత్వం వహించారు.

కొన్ని సినిమాలకు రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా బాధ్యతలను నిర్వహించారు. సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వద్ద దర్శకత్వంలో ఆయన మెళకువలు నేర్చుకున్నారు. తిరుపతికి చెందిన బాలాజీ ప్రసాద్ కు భార్య గౌరి, కుమార్తె స్నేహపూజిత ఉన్నారు. బాలాజీ మృతి పట్ల సినీ, టీవీ రంగాలకు చెందిన పలువురు సంతాపాన్ని తెలియజేశారు.