Ashok Babu: సెక్రటేరియట్ లో ఇప్పటికే ఐదుగురు మరణించారు... అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు: అశోక్ బాబు

  • ఏపీలో కరోనా బీభత్సం
  • సచివాలయంలోనూ మృత్యుఘంటికలు
  • వందల మంది ఉద్యోగులు ఆసుపత్రులపాలయ్యారన్న అశోక్ బాబు
  • ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేదని ఆవేదన
  • సీఎం జగన్ కు బహిరంగ లేఖ
TDP MLC Ashok Babu open letter to CM Jagan

ఏపీలో కరోనా భూతం మృత్యుఘంటికలు మోగిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లో కరోనా బారినపడి ఇప్పటివరకు ఐదుగురు ఉద్యోగులు మృత్యువాతపడ్డారని, అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. వందల సంఖ్యలో ఉద్యోగులు కరోనాతో బాధపడుతూ ఆసుపత్రుల పాలయ్యారని వివరించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్నా, రాష్ట్ర సర్కారు పట్టించుకోకపోవడం దారుణమని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని, తద్వారా ఉపాధ్యాయులను, ఇన్విజిలేటర్లను కరోనా ముప్పు నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు పనిచేసే ప్రదేశాల్లో పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. కరోనాతో ఆసుపత్రుల్లో చేరే ఉద్యోగులకు ప్రత్యేక బెడ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News