మాస్ మహారాజ్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు!

26-04-2021 Mon 17:43
  • 'క్రాక్'తో హిట్ కొట్టిన రవితేజ
  • షూటింగు దశలో 'ఖిలాడి'
  • కామెడీ ఎంటర్టైనర్ గా త్రినాథరావు సినిమా  

Nabha Natesh and Priyanka Arul Mohan Acting with Raviteja

రవితేజ అంటే మాస్ .. ఆయన కథలన్నీ కూడా మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే సాగుతుంటాయి. కథ ఏదైనా .. తన పాత్ర ఏదైనా .. మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలతో ఆయన ఆ కథను బిగించేలా చూసుకుంటాడు. ఆల్రెడీ హిట్ కొట్టేసిన 'క్రాక్' .. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'ఖిలాడి' కూడా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నవే. ఆ తరువాత ఆయన శరత్  మండవ .. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయనున్నాడు. శరత్ మండవతో చేయనున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఇక నక్కిన త్రినాథరావు కూడా మాస్ పల్స్ తెలిసిన దర్శకుడే. 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' సినిమాలు చూస్తే, ఆయన ఎంచుకునే కథలు రవితేజ స్టైల్ కి దగ్గరగా ఉంటాయనిపిస్తుంది. రవితేజ బాడీలాంగ్వేజ్ కి తగిన కథను ఎంచుకున్న ఆయన కూడా, త్వరలో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించే పనుల్లోనే ఉన్నాడు. కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు కథనాయికలు ఉంటారట. ఆ పాత్రల కోసం ప్రియాంక అరుళ్ మోహన్ - నభా నటేశ్ లను తీసుకున్నారని తెలుస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.