మానవత్వం... కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించిన పోలీసులు!

26-04-2021 Mon 16:47
  • కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ
  • ఆమె శవాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాని వైనం
  • హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించిన పోలీసులు
ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో కరోనా పేషెంట్లు మృతి చెందుతున్నారు. మరణించిన కొందరి శవాలను తీసుకెళ్లడానికి భయంతో వారి బంధువులు కూడా రాని సందర్భాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. మత్నాని అనే ఒక మహిళ కరోనాకు చికిత్స పొందుతూ, చనిపోయింది.

అయితే ఆమె డెడ్ బాడీని తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. దీంతో ఢిల్లీ పోలీసులే ఆమెకు అంత్యక్రియలను నిర్వహించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మానవతా ధృక్పథంతోనే తాము ఈ పని చేసినట్టు పోలీసులు తెలిపారు. హిందూ ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలను నిర్వహించామని చెప్పారు. మరోవైపు, పోలీసులు చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు.