పొట్టి వీరయ్య మృతి కలచివేసింది: చిరంజీవి

26-04-2021 Mon 11:46
  • అనారోగ్యంగో మృతి చెందిన వీరయ్య
  • 300కు పైగా చిత్రాల్లో నటించిన వీరయ్య
  • ఎన్నో సవాళ్లను అధిగమించిన వ్యక్తి అని కితాబిచ్చిన చిరంజీవి
Chiranjeevi pays condolences to Potti Veeraiah

ప్రముఖ తెలుగు సినీ నటుడు పొట్టి వీరయ్య హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దశాబ్దాలుగా సినీ రంగానికి సేవలందిస్తున్న పొట్టి వీరయ్య... 300కు పైగా సినిమాల్లో నటించారు. వీరయ్య మృతి పట్ల చిరంజీవి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

వృత్తి పరంగా, వ్యక్తిగతంగా వీరయ్య ఎన్నో సవాళ్లను అధిగమించారని తెలిపారు. 300కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. వీరయ్య మృతి తనను కలచివేసిందని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

ఈ మధ్య కాలంలో పొట్టి వీరయ్య అనారోగ్యానికి గురైనప్పుడు చిరంజీవి రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వీరయ్య తెలిపారు. చిరంజీవిగారు స్థాపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వల్లే తాను ఈరోజు బతుకుతున్నానని చెప్పారు.