చిరూ పుట్టినరోజు కానుకగా రానున్న 'ఆచార్య'?

26-04-2021 Mon 11:16
  • కరోనా కారణంగా ఆగిన షూటింగు
  • వాయిదా పడిన విడుదల
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి      

Is Acharya going to release on Chiru birthday

చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు నిలిచిపోయింది. సాధ్యమైనంత త్వరలో తిరిగి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ముందుగా ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలని భావించారు. షూటింగులో అంతరాయాల కారణంగా వాయిదా వేశారు. దాంతో ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

అయితే చిరంజీవి పుట్టినరోజు కారణంగా ఆగస్టు 22వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఈ సినిమా టీమ్ ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ లోగా బ్యాలెన్స్ ఉన్న సీన్స్ ను .. రీ షూట్ చేయాలనుకున్న ఒకటి రెండు సీన్స్ ను పూర్తి చేసేస్తారట. ఆలస్యం అయినప్పటికీ చిరంజీవి బర్త్ డేకి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్త అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే. చిరంజీవి సరసన నాయికగా కాజల్ నటించగా, చరణ్ జోడీగా పూజా హెగ్డే అలరించనున్న సంగతి తెలిసిందే.