బరిలోకి దిగుతున్న 'బంగార్రాజు'

26-04-2021 Mon 10:42
  • బంగార్రాజు కథ రెడీ
  • కల్యాణ్ కృష్ణతోనే సీక్వెల్
  • త్వరలో సెట్స్ పైకి

Soggade Chinni Nayana sequel is going to start soon

నాగార్జున నుంచి కొంతకాలం క్రితం వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నాగార్జున కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఆ సినిమాలో నాగార్జున పోషించిన 'బంగార్రాజు' పాత్రకు .. ఆ పాత్ర లుక్ కు విపరీతమైన ఆదరణ లభించింది. దాంతో ఆ పాత్ర పేరుతో .. అదే లుక్ తో గ్రామీణ నేపథ్యంలోనే మరో సినిమా చేయాలని నాగార్జున భావించాడు. ఆ బాధ్యతను కూడా ఆయన కల్యాణ్ కృష్ణకే అప్పగించాడు.


కల్యాణ్ కృష్ణ ఈ కథపై చాలా రోజుల పాటు కసరత్తు చేశాడు. నాగార్జునను ఒప్పించడానికే ఆయనకి చాలా సమయం పట్టింది. కథ ఓకే అయిన తరువాత కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. అలాంటి ఈ సినిమా జూలై రెండవ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఒక ఇంటర్వ్యూలో నాగార్జున చెప్పారు. బంగార్రాజు బరిలోకి దిగిపోయే ముహూర్తం కుదిరిపోయిందన్న మాట. నాగార్జున - రమ్యకృష్ణ జోడీ ఖాయమైపోయింది. ఇక ఇతర పాత్రల్లో ఏవరెవరు కనిపించనున్నారనేది త్వరలో తెలియనుంది.