Corona Virus: దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు.. పూర్తి అప్ డేట్స్!

  • గత 24 గంటల్లో 2,812 మంది మృతి
  • 3,52,991 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ
  • దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 28,13,658
2812 patients died with Corona in 24 hours in India

దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 2,812 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా 14,02,367 మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించగా... 3,52,991 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,73,13,163కి చేరుకుంది. ఇదే సమయంలో 1,43,04,382 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 28,13,658 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,95,123కి పెరిగింది.

మరోవైపు కరోనా రికవరీ రేటు 83.05 శాతానికి పడిపోవడం ఆందోళనను పెంచుతోంది. దేశంలో అత్యధిక కేసులు, మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్రంలో 66 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. 832 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వైరస్ భారీగా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 14,19,11,223 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

More Telugu News