'పుష్ప' చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేశ్!

26-04-2021 Mon 10:08
  • గిరిజన యువతి పాత్రలో రష్మిక
  • ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్
  • ప్రత్యేక ఆకర్షణగా ఊర్వశీ రౌతేలా ఐటమ్  

Aishwarya Rajesh is playing a sister role in Pushpa

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో ప్రధానంగా సాగుతుందనే వార్తలు ఆరంభంలోనే వచ్చాయి. తన సిస్టర్ మరణానికి కారకుడైన వ్యక్తిని అన్వేషిస్తూనే పుష్పరాజ్ అడవులలోకి ఎంట్రీ ఇస్తాడని చెప్పుకున్నారు. హీరో అమితంగా ప్రేమించే ఆ చెల్లెలి పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం.

ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కారణంగా తన చెల్లెలు చనిపోవడంతో, పగ తీర్చుకోవడం కోసమే పుష్ప స్మగ్లింగ్ గ్యాంగ్ లో చేరతాడని అంటున్నారు. ఇక అడవిలోనే గిరిజన యువతిగా ఉంటూ పుష్పకు హెల్ప్ చేసే పాత్రలో రష్మిక పాత్ర ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నాడు. అల్లు అర్జున్ గ్యాంగ్ తో ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన విషయం తెలిసిందే.