Guntur Fever Hospital: రెమ్‌డెసివిర్ మరణాలను ఆపలేదు.. వైద్యులపై ఒత్తిడి వద్దు: గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్

Remdesivir Can not Stop deaths
  • సరైన సమయంలో, సరైన మోతాదులో ఇవ్వాలి
  • అవసరం లేకున్నా ఇస్తే అనర్థం
  • అధ్యయనాలు కూడా ఇవే చెబుతున్నాయి
కరోనా వైరస్ అత్యవసర చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఔషధంపై గుంటూరులోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘు కీలక ప్రకటన చేశారు. ఈ ఔషధం మరణాలను ఆపలేదని, కాబట్టి దానిని ఇవ్వాలంటూ వైద్యులపై ఒత్తిడి తీసుకురావొద్దని కోరారు. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్నిచెప్పాయన్నారు.

రెమ్‌డెసివిర్‌ను సరైన సమయంలో, సరైన మోతాదులోనే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆక్సిజన్ స్థాయులు తక్కువై ఆసుపత్రిలో చేరి మూడో దశలో ఉన్న కరోనా బాధితులకు మాత్రమే రెమ్‌డెసివిర్‌ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అవసరం లేకున్నా ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ అందరికీ ఇవ్వాల్సిన పనిలేదని రఘు స్పష్టం చేశారు.
Guntur Fever Hospital
Corona Virus
Remdesivir

More Telugu News