Indonesia: మునిగిపోయిన అదృశ్యమైన జలాంతర్గమి.. 53 మంది సిబ్బంది మృతి

  • సముద్ర గర్భాన్ని ఢీకొట్టి మూడు ముక్కలైన జలాంతర్గామి
  • ధ్రువీకరించిన  నేవీ చీఫ్ యుడో మర్గోనో
  • సముద్ర మట్టానికి 800 మీటర్ల లోతు నుంచి సిగ్నల్స్
Indonesia Missing Submarine Found 53 Crew Members Dead

మునిగిపోయిన ఇండోనేషియా జలాంతర్గామి బాలిలో సముద్ర గర్భంలో నేలను ఢీకొట్టి మునిగిపోయింది. దాని శకలాలను గుర్తించినట్టు మిలటరీ తెలిపింది. జలాంతర్గామిలో ఉన్న 53 మంది సిబ్బంది మృతి చెందినట్టు పేర్కొంది. మునిగిపోయిన ‘కేఆర్ఐ నంగాలా 402’ మూడు ముక్కలైందని నేవీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ యుడో మర్గోనో తెలిపారు. అందులో ఉన్న 53 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారని ఇండోనేషియా మిలటరీ హెడ్ హాదీ జయంతో తెలిపారు.

నిన్న ఉదయం సముద్ర మట్టానికి 800 మీటర్లు (2,600 అడుగులు) లోతు నుంచి సిగ్నల్స్ అందుకున్నామని, దీంతో వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్టు చెప్పారు. నౌకకు సంబంధించి నిన్న పలు భాగాలు గుర్తించినట్టు తెలిపారు. ఇందులో లంగరు, సిబ్బంది ధరించిన సేఫ్టీ సూట్స్ ఉన్నట్టు జయంతో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News