Congress: కొత్త కొవిడ్ వ్యాక్సిన్ విధానం వివక్షపూరితం: కాంగ్రెస్

  • టీకా తయారీదారులకు రూ. 1.11 లక్షల కోట్ల లబ్ధి
  • టీకా వేయడంలో వాణిజ్య ప్రయోజనాలు కూడదు
  • మోదీపై విరుచుకుపడిన రణ్‌దీప్ సూర్జేవాలా
congress fires on PM Modi on Vaccination policy

కొత్త కొవిడ్ వ్యాక్సిన్ విధానంపై కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పోసింది. ఇది పూర్తిగా వివక్షపూరితంగాను, ప్రజా ప్రయోజన విధానాలకు విరుద్ధంగానూ ఉందని విరుచుకుపడింది. టీకా తయారీదారులకు రూ.1.11 లక్షల కోట్ల లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించింది. కరోనా సమయంలో ప్రభుత్వం ఇలాంటి విధానాన్ని ఎందుకు అనుమతిస్తోందో మోదీ చెప్పాలని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.

యువతకు, పేదలకు ఉచితంగా టీకా వేసే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ అనేది ప్రజా సేవ అని, దానిలో వాణిజ్య పరమైన ప్రయోజనాలను చూడకూడదని అన్నారు. దేశంలో 45 ఏళ్లకంటే తక్కువ ఉన్న జనాభా 101 కోట్ల వరకు ఉంటుందని, వీరందరికీ టీకాలు వేసేందుకు 202 కోట్ల డోసులు అవసరమని అన్నారు. కేంద్ర విధానాల కారణంగా ఈ ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, లేదంటే ఆయా వ్యక్తులు భరించాల్సి వస్తోందని సూర్జేవాలా విమర్శించారు.

  • Loading...

More Telugu News