Sabbam Hari: విషమంగా సబ్బం హరి ఆరోగ్యం... ఇటీవల కరోనా బారినపడిన మాజీ ఎంపీ

Sabbam Hari health deteriorates
  • ఈ నెల 15న సబ్బం హరికి కరోనా పాజిటివ్
  • తొలుత హోం క్వారంటైన్ లో చికిత్స
  • డాక్టర్ల సలహాతో ఆసుపత్రిలో చేరిక
  • ఆరోగ్యం క్షీణించిందన్న డాక్టర్లు
టీడీపీ నేత సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో సబ్బం హరి విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 15న ఆయనకు కరోనా నిర్ధారణ కాగా, తొలుత ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. అయితే లక్షణాలు తీవ్రతరం కావడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు.

ఈ నేపథ్యంలో, సబ్బం హరి ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా మారిందని డాక్టర్లు వెల్లడించారు. గత మూడ్రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
Sabbam Hari
Health
Critical
Corona Virus
Visakhapatnam
TDP

More Telugu News