Ravindra Jadeja: బీసీసీఐ జడేజాకు ఏ ప్లస్ కాంట్రాక్టు ఎందుకు ఇవ్వాలో ఈ ఇన్నింగ్స్ చెబుతోంది: మైకేల్ వాన్

  • ఇటీవల కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ
  • జడేజాకు ఏ గ్రేడ్
  • ఏ ప్లస్ ఎందుకివ్వలేదని మాజీల విమర్శలు
  • నేటి ఐపీఎల్ మ్యాచ్ లో జడేజా విధ్వంసం
  • బీసీసీఐ కాంట్రాక్టులను ప్రస్తావించిన మైకేల్ వాన్
Michael Waughan advocates for Ravindra Jadeja

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇటీవల ప్రకటించిన తాజా వార్షిక కాంట్రాక్టుల్లో రవీంద్ర జడేజాను ఏ గ్రేడ్ లో ఉంచడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇటీవల కాలంలో అద్భుతంగా రాణిస్తున్న జడేజాను ఏ ప్లస్ గ్రేడ్ లో చేర్చితే బాగుండేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇవాళ ఐపీఎల్ లో బెంగళూరుతో మ్యాచ్ లో జడేజా చిచ్చరపిడుగులా చెలరేగడం పట్ల స్పందించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి బీసీసీఐ కాంట్రాక్టుల అంశాన్ని ప్రస్తావించాడు. జడేజాకు బీసీసీఐ అత్యుత్తమ గ్రేడ్ ఎందుకు ఇవ్వాలో నేటి ఇన్నింగ్స్ చెబుతుందని ట్వీట్ చేశాడు. ఒకే ఓవర్లో అద్భుతమైన రీతిలో 6,6,6,6,2,6,4 బాదాడని కితాబిచ్చాడు.

కాగా, బీసీసీఐ ఇటీవల ప్రకటించిన కాంట్రాక్టుల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఏ ప్లస్ గ్రేడు దక్కించుకున్నారు. ఏ ప్లస్ గ్రేడులో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు చెల్లిస్తారు.

More Telugu News