Corona Virus: 18-44 మధ్య వయసు వారు టీకా తీసుకోవాలంటే రిజిస్ట్రేషన్‌ తస్పనిసరి

  • వ్యాక్సినేషన్‌ వేగవంతానికి కేంద్రం చర్యలు
  • మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా
  • టీకా కేంద్రాల వద్ద తాకిడి నియంత్రించడానికే రిజిస్ట్రేషన్‌
  • నేరుగా వస్తే నో వ్యాక్సిన్‌
Registration must for 18 to 44 age group to get vaccinated

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వనున్నారు. అయితే, 18-44 ఏళ్ల వారు తప్పనిసరిగా ముందస్తుగా రిజిస్టర్‌ చేసుకోవాలని కేంద్రం వెల్లడించింది. నేరుగా వచ్చిన వారికి టీకా ఇవ్వడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. 45 ఏళ్లు పైబడిన వారికి ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే యథాతథంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

మే 1 నుంచి టీకా కేంద్రాలకు తాకిడి పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. దీన్ని నియంత్రించడానికే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది.  ఏప్రిల్‌ 28 నుంచి కొవిన్‌ వెబ్‌సైట్‌, ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కేంద్రం వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందిస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News