బుర్ర ఉందా, లేదా?... పది, ఇంటర్ విద్యార్థులకు కరోనా రాదా?: ఏపీ సర్కారుపై శైలజానాథ్ విసుర్లు

25-04-2021 Sun 16:51
  • ఏపీలో పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విపక్షాలు
  • తీవ్రస్థాయిలో స్పందించిన శైలజానాథ్
  • పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్
  • గతేడాది రద్దు చేశారు కదా అంటూ వ్యాఖ్యలు
AP PCC Chief Sailajanath slams state govt over public exams

ఏపీలో పది, ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉండగా, ఆ నిర్ణయాన్ని విపక్ష నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ఈ అంశంలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకే కరోనా వస్తుందా... పది, ఇంటర్ విద్యార్థులకు కరోనా రాదా? అని ప్రశ్నించారు. పరీక్షలు రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

గతేడాది రద్దు చేసిన ప్రభుత్వం ఈసారి ఎందుకు ఆలోచిస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోయి విద్యార్థుల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా వ్యవహరించవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిపోతున్నాయని, సీఎం జగన్ ఇప్పటికైనా పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని శైలజానాథ్ అన్నారు.